Accenture Expansion in India: ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఇండియాలోని టైర్-2 నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించే ప్లాన్‌లో ఉంది. ఇందులో భాగంగా జైపూర్, కోయంబత్తూర్‌లలో తమ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. టైర్-2 నగరాలకు విస్తరించడం ద్వారా ఎక్కడి నుంచి పనిచేయాలనే విషయంలో ఉద్యోగులకు మరింత వెసులుబాటు దొరుకుతుందని భావిస్తోంది.
'అందరికీ ఒకే మోడల్ సరిపోదని మేము భావిస్తున్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పనిచేయాలనే విషయంలో మా విధానం బిజినెస్‌ని బట్టి, టీమ్‌ని బట్టి మారుతుంటుంది. ఇండియాలోని మా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ నుంచి ఎక్కడి నుంచి పనిచేయాలనేది ఉద్యోగులే ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. ఇండియాలో యాక్సెంచర్ కార్యాలయాలు విస్తరించిన నగరాల్లో.. ఏ నగరం నుంచి పనిచేయాలనేది వారే నిర్ణయించుకోవచ్చు.' అని యాక్సెంచర్ పేర్కొంది.
ప్రస్తుతం యాక్సెంచర్ వెబ్‌సైట్‌లో జైపూర్ లొకేషన్‌కి వేకన్సీస్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఆపరేషనల్ డేటా కలెక్షన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జైపూర్‌లో తమ కార్యాలయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ప్రముఖ జాతీయ మీడియాతో యాక్సెంచర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే కోయంబత్తూర్‌లో కార్యాలయాన్ని మాత్రం యాక్సెంచర్ ధ్రువీకరించలేదు. అయితే ఇప్పటికే పలు జాబ్ వెబ్ సైట్స్ మాత్రం కోయంబత్తూర్‌లో యాక్సెంచర్ కంపెనీ బీపీఓ, అప్లికేషన్ డెవలపర్ పోస్టులకు అభ్యర్థులను హైర్ చేసుకుంటున్నట్లు ప్రకటనలిస్తున్నాయి.
యాక్సెంచర్‌లో మొత్తం 6,24,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇందులో ఒక్క ఇండియాలోనే 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్ 2 నగరాలకు విస్తరించడం ద్వారా తమ ఉద్యోగులకు వర్క్ లొకేషన్ విషయంలో మరింత వెసులుబాటు కల్పించవచ్చునని యాక్సెంచర్ భావిస్తోంది.
Also Read: Smartphones scheme: రైతులకు గుడ్ న్యూస్- స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.6000 సాయం!
Business Yantra: వ్యాపారంలో సక్సెస్‌కి వ్యాపార వృద్ధి యంత్రం.. దీనితో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook