Aadhaar Update News: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. రెండు కీలకమైన ఆధార్ కార్డు సేవల్ని యూఐడీఏఐ నిలిపివేసింది. ఈ ప్రభావం నేరుగా ఆధార్ కార్డు హోల్డర్లపై పడనుంది. నిలిచిపోయిన ఆ రెండు సేవలేంటంటే...
నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారం ఆధార్ కార్డ్. ప్రభుత్వ పనైనా మరే ఇతర పనైనా సరే ఆధార్ లేనిదే జరగని పరిస్థితి. ఆధార్ కార్డులో ఇచ్చే సమచారం పూర్తిగా అప్‌డేటెడ్ అయి ఉంటే అన్ని విధాల లాభదాయకం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో అప్‌డేట్స్ అందిస్తుంది. ఇటీవల ఆధార్ కార్డుకు సంబంధించిన రెండు కీలకమైన సేవల్నియూఐడీఏఐ నిలిపివేసింది. దీని ప్రభావం అందరిపై స్పష్టంగా పడనుంది.
అడ్రస్ వేలిడేషన్ లెటర్
అడ్రస్ వేలిడేషన్ లెటర్ ద్వారా ఆధార్ కార్డులో చిరునామా అప్‌డేట్ చేసే సౌకర్యాన్నియూఐడీఏఐ తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ నిలిపివేసింది. అద్దెకుండేవాళ్లు లేదా ఇతర ఆధార్ కార్డు హోల్డర్లు ఈ విధానం ద్వారా సులభంగా అడ్రస్ అప్‌డేట్ చేయించుకునేవారు. ఇప్పుడు యూఐడీఏఐ అడ్రస్ వేలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించింది. అడ్రస్ వేలిడేషన్ లెటర్ సౌకర్యం తదుపరి ఆదేశాలవరకూ నిలిపివేశామని యూఐడీఏఐ తెలిపింది. ఈ జాబితాలో ఉన్న https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf ఇతర వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్స్ ద్వారా అడ్రస్ అప్‌డేట్ చేయవచ్చు.
ఈ నిర్ణయంతో ఆధార్ కార్డు అడ్రస్ అప్‌డేట్ చేయించుకునేవారికి సమస్య ఎదురుకానుంది. ప్రత్యేకించి అద్దెకుండేవారికి ఇబ్బందే. ఏ విధమైన ప్రూఫ్ లేకపోతే అద్దెకుండేవాళ్లు అడ్రస్ అప్‌డేట్ చేయించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇక నిలిచిపోయిన మరో సేవ ఆధార్ కార్డు రీ ప్రింట్. పాత పొడుగు ఆధార్ కార్డు స్థానంలో యూఐడీఏఐ ఇప్పుడు ప్లాస్టిక్ పీవీసీ కార్డు జారీ చేస్తోంది. కొత్త పీవీసీ కార్డును జేబులో లేదా వ్యాలెట్‌లో సులభంగా పెట్టుకోవచ్చు. పాత ఆధార్ కార్డును రీప్రింట్ చేయడం డిస్‌కంటిన్యూ చేస్తున్నట్టు ఆధార్ హెల్ప్ సెంటర్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. దీనికి బదులుగా ఆధార్ పీవీసీ కార్డును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.