Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండి

Aadhaar Card Alert: ఆధార్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. మీ ఆధార్ కార్డు కేన్సిల్ కాగలదు జాగ్రత్త. ప్రభుత్వం 65 వేల ఆధార్ కార్డుల్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకు..రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2024, 11:25 AM IST
Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండి

Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి. అందుకే యూఐడీఏఐ ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువుని పలుసార్లు పొడిగించింది. ఇప్పటికీ వేలాదిమంది ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోలేదు. మీ ఆధార్ కార్డు 10 ఏళ్లు లేదా అంతకంటే పాతదైతే ఒకసారి అప్‌డేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. లేకపోతే మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు. ఒక్క భోపాల్‌లోనే 65 వేలమంది ఆధార్ కార్డుని అప్‌డేట్ చేసుకోలేదు. దాంతో ఈ ఆధార్ కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికీ మీరు మీ ఆధార్ కార్డుని అప్‌డేట్ చేసుకోకుంటే మై ఆధార్ పోర్టల్ ద్వారా కావల్సిన డాక్యుమెంట్ల సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం చాలా అవసరం. ఇదొక ఐడీ కార్డులా కూడా ఉపయోగపడుతోంది. ఏ పనికైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. పదేళ్లు దాటిన ఆధార్ కార్డు ఉంటే అడ్రస్ లేదా ఫోటో మార్చాల్సిన అవసరం రావచ్చు. ఫోన్ నెంబర్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. 

యూఐడీఏఐ మరోసారి ఆధార్ కార్డు అప్‌డేట్ చేసేందుకు గడువు పెంచింది. ఈసారి డిసెంబర్ 14 వరకూ గడువు విధించింది. గతంలో మార్చ్ 14 చివరి తేదీ ఉండేది అది కాస్తా జూన్ 14 వరకూ పొడిగించారు. తరువాత సెప్టెంబర్ 14 వరకూ వెళ్లింది. ఇప్పుడిక డిసెంబర్ 14 లోగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 

ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేసుకోవచ్చు

మై ఆధార్ పోర్టల్‌‌లో లాగిన్ అయి మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఇప్పుడు మీ ఐడీ, అడ్రస్‌కు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌‌లోడ్ చేయాలి. ప్రస్తుతం ఆధార్ కార్డు అప్‌డేట్ అనేది ఫ్రీ సర్వీసుగానే ఉంది. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసేందుకు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, జన్ ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి అవసరమౌతుంది. 

Also read: Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News