7th pay commission: ప్రతియేటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరుగుతుంటుంది. జనవరిలో తొలిసారి, జూలైలో రెండవసారి. కాస్త ఆలస్యమైనా ఎరియర్లతో కలిసి వస్తుంటుంది. ఈసారి రెండు డీఏల పెంపు ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది. డిసెంబర్ 2022 ఏఐసీపీఐ సూచీ 132.3 పాయింట్లు ఉంది. అటు జనవరి 2023 నెల సూచీ 132.8కు చేరుకుంది. రానున్న నెలల్లో ఈ సూచీ మరింత పెరగవచ్చని అంచనా. జనవరి 2023 డీఏ పెంపుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ డీఏ పెంపు గతంలో ఉన్నట్టే 4 శాతం ఉంటుందని నిర్ధారణైంది. అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న 38 శాతం డీఏ..4 శాతం పెంపుతో 42 శాతానికి చేరుకుంది. డీఏ పెంపు ద్వారా 65 లక్షలమంది ఉద్యోగులు, 48 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ డీఏ పెంపు రెండవసారి జూలై 2023లో జరగనుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ పెంపు
ప్రతి నెలా కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాల ఆధారంగా డీఏ పెంపు నిర్ణయిస్తారు. డిసెంబర్ నెలలో తగ్గిన సూచీ..జనవరి నెలలో పెరిగింది. రానున్న నెలల్లో డీఏ మరింత పెరగవచ్చని అంచనా. అంటే వచ్చే జూలై నాటికి డీఏ పెంపు మరో 4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి నుంచి జూన్ వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జూలైలో పెంపు ఉంటుంది. జూలై నెల డీఏ పెంపు అనేది సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఉంటుంది.
132.8కు చేరుకున్న ఏఐసీపీఐ
డిసెంబర్ 2022 సూచీ 132.3 పాయింట్లు ఉంటే..జనవరి 2023 సూచీ మాత్రం 132.8కు చేరుకుంది. ప్రస్తుతం ఈ సూచీ ట్రెండ్ పైకి చూపిస్తోంది. జూలై 1న నిర్ణయించాల్సిన డీఏ పెంపు 4 శాతం ఉండవచ్చని అంచనా. జనవరి తరువాత వచ్చే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగానే జూలై నెలలో డీఏ పెంపు ప్రకటన ఉంటుంది.
ఏడాదికి రెండుసార్లు పెరగనున్న డీఏ
7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి 2023 తొలి డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉంటుంది. 4 శాతం పెరగనుందని ఇప్పటికే దాదాపుగా తేలిపోయింది. ఇక రెండవసారి జూలై నెల డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో మరో 4 శాతం ఉండవచ్చని అంచనా. ఏఐసీపీఐ అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ సూచీని ప్రతి నెలా జారీ చేసేది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. ఈ సూచీ ఆధారంగానే డీఏ ఎంత పెంచాలనేది నిర్ణయమౌతుంది.
Also read: Credit Cards Without Fee: యాన్వల్ ఫీజు లేకుండానే డిస్కౌంట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook