కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు

బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు

Last Updated : Feb 7, 2018, 08:51 PM IST
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు

వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి కాసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కోరారు. 

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్సార్సీ ఎంపీలు తమ ఆవేదనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. 

Trending News