ఉద్యోగాల అంశంపై చంద్రబాబును నిలదీసిన జగన్

                                

Last Updated : Mar 29, 2019, 06:08 PM IST
ఉద్యోగాల అంశంపై చంద్రబాబును నిలదీసిన జగన్

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ  పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరి మరోకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ రోజు జరిగిన రోడ్ షో లో పాల్గొన్న జగన్.. ఏపీలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావించారు..బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఈ ఐదేళ్ల కాలంలో బాబు తన కుమారుడికి మాత్రమే జాబు ఇప్పించుకున్నారని ఎద్దేవ చేశారు. సామాన్య జనాలకు ఎవరికీ ఉద్యోగాలు లేవు.. సరే ఉద్యోగం లేని నిరుద్యోగలకు నెలసరి భృతి అందిస్తాన్నారు.. అది చేయలేదు.. 

బాబు మొసలి కన్నీటిని నమ్మోదు..

ఇప్పుడు ఎన్నికల వచ్చేసరికి నిరుద్యోగులపై చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని జగన్ ఆరోపించారు. ఐదేళ్లుగా లేని నిరుద్యోగ భృతి ఎన్నికల వేళ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. గత ఐదేళ్లుగా ఉద్యోగాలు లేక యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే ఏం చేశారు...  గాడిదలు కాస్తున్నారా ? అంటూ చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

మాయ మాటలు ఇక చాలు బాబు

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉంటే...  చంద్రబాబు మాత్రం 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని గొప్పలు చెబుతున్నారు. వాస్తవానికి ఉద్యోగాలు రావడం దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు కూడా పోయి దిక్కు తోచని స్థితిలో యువత ఉన్నారు. మాయ మాటలు ఇక చాలు బాబు అని జనాలు అంటున్నారని జగన్ ఎద్దేశ చేశారు.

Trending News