AP: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంబంధించిన సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )ను పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషల్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ పిటీషన్లను కొట్టివేసింది.
జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్లకు అసలు విచారణ అర్హతే లేదని తేల్చింది. పిటీషన్లలో ప్రస్తావించిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటీషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోరగా..గ్యాగ్ ఆర్డర్ ( Gag Order ) ఎత్తివేసిన తరువాత ఇదెలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు.
ఇక సీబీఐ ( CBI ) దర్యాప్తు జరపాలా వద్దా అనేది ఛీఫ్ జస్టిస్ పరిధిలో అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనే అభ్యర్ధనకు అర్హతే లేదని చెప్పింది కోర్టు. ఇక లేఖలో అంశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు మరో బెంచ్ పరిశీలిస్తోందని పేర్కొంది. పిటీషన్లో పేర్కొన్న అంశాలు కూడా గందరగోళంగా ఉన్నాయని..సుప్రీంకోర్టు ( Supreme Court ) వ్యాఖ్యానించింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందని..నిధులు ఎక్కడివని కోర్టు ప్రశ్నించింది. లేఖలోని అంశాలపై ఎంతమంది జోక్యం చేసుకుంటారని అసహనం వ్యక్తం చేసింది. Also read: AP: జేసీ దివాకర్ రెడ్డికు షాక్..వంద కోట్ల భారీ జరిమానా..కారణమిదే