Attack On MLA Talari Venkatrao: పోలీసుల సమక్షంలో ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి - బతుకు జీవుడా అంటూ పరుగులు..!

Attack On MLA Talari Venkatrao: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తప్లలిలో కాసేపు టెన్షన్‌ నెలకొంది. పోలీసులకే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ఏమీ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 06:28 PM IST
  • ఏలూరు జిల్లా జి.కొత్తప్లలిలో ఉద్రిక్తత
  • పోలీసుల సమక్షంలో ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి
  • ఘటనలో గాయపడ్డ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
Attack On MLA Talari Venkatrao: పోలీసుల సమక్షంలో ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి - బతుకు జీవుడా అంటూ పరుగులు..!

Attack On MLA Talari Venkatrao: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తప్లలిలో కాసేపు టెన్షన్‌ నెలకొంది. పోలీసులకే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ఏమీ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో, ఏకంగా ఎమ్మెల్యేపైనే గ్రామస్తులు దాడికి దిగారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే సహా పలువురు గాయపడ్డారు.

అధికారపార్టీ ఎమ్మెల్యే పైనే... అదీ పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు చూస్తే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అధికార పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడి హత్యతో ఊళ్లో కలకలం చెలరేగింది. ప్రత్యర్థులు ప్రసాద్‌ను కత్తులతో నరికి చంపేశారు. అయితే, ప్రసాద్‌ను హత్య చేసిందెవరనేదిఇంకా తేలలేదు. కానీ, సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ ప్రోద్భలంతోనే ఈ హత్య జరిగిందన్న విమర్శలు వచ్చాయి. ప్రసాద్ మద్దతుదారులంతా ఈ పరిణామంతో ఆగ్రహంతో ఊగిపోయారు.

గంజి ప్రసాద్ హత్య గురించి తెలుసుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జి.కొత్తపల్లి గ్రామానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రసాద్‌ వర్గీయులు ఎమ్మెల్యేను చూడగానే ఒక్కసారిగా ఎటాక్‌ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను వారించే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు వినలేదు. ముందుకు దూసుకొచ్చారు. అయితే, అక్కడున్న పోలీసు ఫోర్స్‌ గ్రామస్తులను నిలువరించేందుకు సరిపోలేదు. అది గమనించిన పోలీసులు.. పరిస్థితి చేయిదాటుతుందని గమనించి.. ఎమ్మెల్యేను దగ్గర్లోని స్కూల్‌లోకి పరుగు పరుగున తీసుకెళ్లారు. కానీ, వాళ్లను అనుసరించిన గ్రామస్తులు ఎమ్మెల్యేను వెంబడించి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులను కూడా లెక్కచేయలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గాయపడ్డారు. అలాగే, పలువురు గ్రామస్తులకూ గాయాలయ్యాయి.

ప్రస్తుతం వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంజి ప్రసాద్‌కు, అదే గ్రామానికి చెందిన సొంతపార్టీ ఎంపీటీసీకి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా గ్రామంలో వర్గపోరు జరుగుతోంది. ఎంపీటీసీకి ఎమ్మెల్యే మద్దతు ఉందని ప్రసాద్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రసాద్‌ హత్య జరగడంతో ఎంపీటీసీ కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. అందుకే పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు.

దాడి తర్వాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషాలు వెల్లడించారు. జి.కొత్తపల్లిలో తమ పార్టీకి సంబంధించి రెండు వర్గాల మధ్య వర్గపోరు కొనసాగుతున్న మాట వాస్తవమే అన్నారు. అయితే, తనపై దాడిచేసిన వాళ్లు వైసీపీకి చెందిన వాళ్లు కాదని, అక్కడి టీడీపీ వర్గీయులే కుట్రతో తనపై దాడికి జనాన్ని ఉసిగొల్పారని ఆరోపించారు. హత్యకు గురైన ప్రసాద్‌తో తనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని ఎమ్మెల్యే వెంకట్రావు స్పష్టం చేశారు. 

Also Read: Mysterious Liver Illness: ప్రపంచాన్ని భయపెడుతున్న మరో అంతుచిక్కని వ్యాధి.. అమెరికా, యూకెల్లో బయటపడిన కేసులు...

Also Read:  TTD Governing Council: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News