Dharmendra pradhan: వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra pradhan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతుంటే..కేంద్రం మాత్రం ప్రశంసిస్తుండటం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2021, 12:54 PM IST
Dharmendra pradhan: వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra pradhan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతుంటే..కేంద్రం మాత్రం ప్రశంసిస్తుండటం విశేషం.

విశాఖపట్నంలో నిర్మించిన వేయి పడకల కోవిడ్ ఆసుపత్రిని(Thousand bed Covid Hospital) కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (Ap cm ys jagan) పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు లక్ష్యమున్న లక్షణమైన నాయకులంటూ కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ పొగడ్తలతో ముంచెత్తారు. మొదటి, రెండవ దశల్లో కరోనా నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ అభినందనలు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం వైద్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని..మంచి నిర్ణయాలు, పనులకు కేంద్రం ఎప్పుడూ అండా నిలుస్తుందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union minister Dharmendra pradhan)తెలిపారు. కరోనా కట్టడికి నిరంతరం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని నియంత్రించగలమని చెప్పారు. మెగా మెడికల్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావాన్ని తగ్గిస్తూ అన్నిరంగాల్లో ముందుండి..అన్ని అంశాల్లో చొరవ తీసుకుని ముందుకు వెళ్తున్న ఏపీ..మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులు ఏపీ ప్రభుత్వాన్ని(Ap government) ప్రశంసిస్తుంటే..రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

Also read: Oxygen Demand: ఏపీలో గణనీయంగా తగ్గిన ఆక్సిజన్ వినియోగం, ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News