ప్రైవేటు పార్టీలకు తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంను ప్రైవేటు కార్యక్రమాలకు ఆర్డర్ ప్రకారం అందించడానికి తితిదే రంగం సిద్ధం చేసింది. కావాల్సినవారు సంస్థ, సంఘం తరుపున లేఖలో ఆర్డర్ ఇవ్వాలని కోరింది.

Last Updated : Dec 3, 2017, 04:07 PM IST
ప్రైవేటు పార్టీలకు తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంను ప్రైవేటు  కార్యక్రమాలకు ఆర్డర్ ప్రకారం అందించడానికి తితిదే రంగం సిద్ధం చేసింది. కావాల్సినవారు సంస్థ, సంఘం తరుపున లేఖలో ఆర్డర్ ఇవ్వాలని కోరింది. స్టాకు, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలా?వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు విధివిధానాలను నవంబరు నెలలో జారీచేసినప్పటికీ.. డిసెంబరు నుంచి అమలు కానుంది.  

భక్తుల కోరిక మేరకే ప్రైవేటు ఫంక్షన్లకు లడ్డూలను విక్రయిస్తున్నట్లు తితిదే అధికారులు పేర్కొన్నారు. లడ్డూతో పాటు చిన్న వడ ప్రసాదాన్ని కూడా అందిస్తామని తెలిపారు. 

ప్రైవేటు కార్యక్రమాలకు అందించే సాధారణ ధరలు  

పెద్ద లడ్డూ - రూ.100 
చిన్న వడ- రూ.25
లడ్డూ- రూ.25, 
చిన్న లడ్డూలు- రూ.3.50 

అయితే ఒక్కో కార్యక్రమానికి పెద్ద లడ్డూలు 100, చిన్న వడలు 10, లడ్డూలు 200, చిన్న లడ్డూలు 1000 చొప్పునే అందిస్తామని ప్రకటించింది. 

ప్రసాదం నాణ్యతతో కావాల్సి వస్తే.. 

పెద్ద లడ్డూ- రూ.200 
చిన్న వడ- రూ.100 
లడ్డూ- రూ.50
చిన్న లడ్డూలు- రూ.7

Trending News