/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Anandaiah medicine: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారికి మందు కనిపెట్టడమే కాకుండా అద్భుత ఫలితాలు సాధిస్తూ ఒక్కసారిగా సంచలనమయ్యారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య (Anandaiah medicine) సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంతో మందు తయారు చేసిన మందు అద్బుతంగా పనిచేస్తుందంటూ ప్రచారం సాగింది. జనం ఒక్కసారిగా పోటెత్తారు. అదే సమయంలో మందు శాస్త్రీయతపై సందేహాలు రావడంతో మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం..ఆయుష్ వైద్య బృందాన్ని(Ayush Team)అధ్యయనం కోసం రంగంలో దింపింది. మరోవైపు సీసీఆర్ఏఎస్ బృందం రానుంది. ఇప్పటికే ఆయుష్ బృందం అధ్యయనం చేస్తోంది.

ఇక ఇదే మందును టీటీడీ (TTD) ఆధ్వర్యంలోని ఆయుర్వేద కళాశాల నిపుణుల బృందం అద్యయనం చేస్తోంది. పరిశోధనలు ప్రారంభించింది. ఆనందయ్య మందుపై ప్రజల్లో మంచి స్పందన ఉందని..దీనిపై ఆయుష్ నుంచి నివేదిక రావల్సి ఉందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ( Yv Subbareddy) తెలిపారు. ఇక క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials on krishnapatnam medicine) విషయంలో ఆయుష్ శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఆనందయ్య మందునే టీటీడీ ఆయుర్వేద కళాశాలలో తయారుచేసి..కనీసం 5 వందల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నివేదిక వచ్చేందుకు ఓ వారం రోజుల సమయం పడుతుందన్నారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే..టీటీడీ తరపున ఈ మందును ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల ప్రయోజనార్ధం కేంద్ర ప్రభుత్వం ఈ మందును నిర్ధారణ చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందిస్తుందని స్పష్టం చేశారు. 

Also read: Ayush Report: కృష్ణపట్నం మందుతో ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యమంత్రి చేతికి నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
TTD Ayurvedic college likely to conduct clinical trials on krishnapatnam corona medicine
News Source: 
Home Title: 

Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్

Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్
Caption: 
Yv Subbareddy ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, May 24, 2021 - 19:36
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
96
Is Breaking News: 
No