TDP vs NTR fans: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేసిన తెలుగు తమ్ముళ్లు

TDP vs NTR fans: తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే కొందరు టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేకోపోతున్నారు. ఒకటి కాదు రెండు ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే దౌర్జన్యం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2024, 03:27 PM IST
TDP vs NTR fans: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేసిన తెలుగు తమ్ముళ్లు

TDP vs NTR fans: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ రా..కదలిరా సభలు నిర్వహించింది. ఈ సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హాజరైన ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. వెంట తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, ఫోటోలు లాక్కుని పంపించేశారు. 

ఏపీ తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నేతల సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇదే జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ రా కదలి రా పేరిట నిర్వహించిన సభకు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో హాజరయ్యారు. ఇది చూసి సహించలేని టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. ఫోటోలు, ఫ్లెక్సీలు లాక్కుని అక్కడ్నించి వెళ్లగొట్టారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్న పాపానికి చంద్రబాబు సమక్షంలోనే దాడికి దిగారు. 

ఆచంటలో అయితే ఈ ఇద్దరి ఘర్షణ సమయంలో జనసేన అభిమానుల జెండాల్ని సైతం లాక్కుని బయటకు విసిరేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తల దాడితో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. 

Also read: Sankranthi Movies: సంక్రాంతికి థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News