/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Chandrababu: రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని మరోమారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని..తాను ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. పార్టీ నేతలకు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర పునర్ నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు..పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై మార్గనిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలని..వారి కోసం పనిచేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పొందాలని స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు చందబ్రాబు. ఇందులో ఎలాంటి సందేహం లేదని..ప్రజల్లో ఉన్న నేతలకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

ఈసందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఈసందర్భంగా వైసీపీకి సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా వస్తే వైసీపీనో, టీడీపీనో తేల్చుకుందామన్నారు. త్వరలో ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని స్పష్టం చేశారు. నెత్తిన ఉన్న కుంపటి ఎప్పుడు దించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పేరు చెబితేనే వైసీపీ వెన్నులో వణుకు మొదలవుతుందన్నారు. 

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీలో పోరాడే శక్తిని తయారు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఠా రాజకీయాలు, ఫ్యాక్షనిజం అంతం చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు చంద్రబాబు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాపై నిఘా ఉండాలని..వైసీపీ నేతలు వీటిలో గోల్‌మాల్ చేస్తారని ఆరోపించారు. ఈసందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులకు ప్రకటించారు. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్‌ పేర్లను ఖరారు చేశారు. త్వరలోనే విశాఖకు అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు చంద్రబాబు.

Also read:Cristina Fernadez: అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం.. పబ్లిక్‌లో పాయింట్ బ్లాక్‌లో గన్‌ గురిపెట్టిన దుండగుడు..   

Also read:Weather Updates: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
telugu desam party chief chandra babu naidu interesting comments on alliances
News Source: 
Home Title: 

Chandrababu: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయబోతున్నాయా..చంద్రబాబు ఏమన్నారంటే..!

Chandrababu: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయబోతున్నాయా..చంద్రబాబు ఏమన్నారంటే..!
Caption: 
telugu desam party chief chandra babu naidu interesting comments on alliances(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

పొత్తులపై హాట్‌ హాట్‌గా చర్చ

ఎన్డీఏలోకి టీడీపీ?

స్పందించిన చంద్రబాబు

Mobile Title: 
Chandrababu: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయబోతున్నాయా..చంద్రబాబు ఏమన్నారంటే..!
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Friday, September 2, 2022 - 14:58
Request Count: 
72
Is Breaking News: 
No