Chandrababu: మరో విజన్ ప్రకటించిన చంద్రబాబు..విజన్ 2047లో విశేషాలు ఇవిగో..!

Chandrababu: గుంటూరు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేబ్రోలులో జాతీయ జెండాను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎగురవేశారు. ఈసందర్భంగా తన విజన్‌ను ప్రకటించారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 15, 2022, 05:18 PM IST
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • జెండాను ఎగురవేసిన చంద్రబాబు
  • అనంతరం తన విజన్ ప్రకటన
Chandrababu: మరో విజన్ ప్రకటించిన చంద్రబాబు..విజన్ 2047లో విశేషాలు ఇవిగో..!

Chandrababu: విజన్ 2020 అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఈ విజన్‌ను ప్రకటించారు. తాజాగా మరో విజన్‌ను ప్రజల ముందు ఉంచారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047ను సమావేశంలో ప్రస్తావించారు. 

రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలన్నారు. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని..భారత్‌ బలమైన యువశక్తి ఉన్న దేశమని..అందుకే యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు. దేశంలో సంపద సృష్టి జరగాలని తెలిపారు. ఆ సంపదను ప్రజలకు పంచాలని తన విజన్ 2047లో వెల్లడించారు. 

రైతుల కోసం ప్రత్యేక విధానాలను రూపొందించాలని..75 ఏళ్ల తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగడం మంచిదికాదన్నారు. విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలని..దేశ నిర్మాణంలో ఇది ఎంతో కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. దేశంలో నదుల అనుసంధానం జరగాలని..ఏపీలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. 

కరువు రహిత దేశంలో నదుల అనుసంధానం అవసరమన్నారు. దేశంలో అవినీతి లేని పాలనను అందించాలని..సాంకేతికత ద్వారా అవినీతిని అంతమొందించాలని చంద్రబాబు చెప్పారు. రానున్న 25 ఏళ్లలో అగ్ర దేశంగా భారత్ అవతరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అన్ని అర్హతలు, వనరులు ఉన్న ఇండియా..ప్రపంచంలో నెంబర్ కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంతోపాటు ప్రజలు సైతం సంకల్పం, ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు చంద్రబాబు.

గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన జెండా వందనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు.

Also read:Jio 5G Phone: జియో నుంచి 5జీ ఫోన్..ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..!

Also read:Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News