Buddha Venkanna Arrest:ఆంధ్రలో హైటెన్షన్...రోడ్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్రలతో హంగామా

తెలుగు దేశం పార్టీ నేతల బంద్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్రిక్తల పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం అరెస్టులతో, నేతల గృహ నిర్బంధాలతో కొనసాగుతుంది. కర్రలతో బుద్దా వెంకన్న హంగామా చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 11:34 AM IST
  • టీడీపీ నేతల బంద్ పిలుపుతో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తల పరిస్థితి
  • విశాఖ పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్ అనంతలక్ష్మి అరెస్ట్
  • కర్రలతో రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్
Buddha Venkanna Arrest:ఆంధ్రలో హైటెన్షన్...రోడ్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్రలతో హంగామా

 Buddha Venkanna Arrest: ఆంధ్రప్రదేశ్ గొడవల మధ్య రగిలిపోతుంది. పట్టాభి వ్యాఖ్యలతో షురు అయిన గొడవ టీడీపీ, వైసీపీ నిరసనలతో రాష్ట్రంలో హై టెన్షన్ నెలకొంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలు మరియు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడులకు నిరసన తెలుపుతూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. 

తెలుగు దేశం పార్టీ నేతల బంద్ పిలుపుతో రాష్ట్రాల్లో ఉద్రిక్తలు తార స్థాయికి చేరుకున్నాయి. ఇక విశాఖ జిల్లాలోని జగదాంబ జంక్షన్ లో విశాఖ పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్ అనంతలక్ష్మి, మహిళ నేతలు మరియు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Also Read: Vaccination Drive: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం

అటు పట్టాభి వ్యాఖ్యలకు వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళనలు చేపట్టారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చటంతో ఉదయం నుండే పోలీసులు టీడీపీ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడే నిర్బంధం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇక టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యకర్తలతో చేతిలో కర్రలను పట్టుకొని రోడ్లపై హంగామా చేశారు. వెంకన్న చేసిన హంగామాతో ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయటానికి ప్రయత్నించగా.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు మరియు తోపులాట జరగటంతో బుద్దా వెంకన్న షర్ట్ కూడా చినిగిపోయింది. 

Also Read: T20 World Cup 2021: టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదు: సెహ్వాగ్

చివరకు బుద్దా వెంకన్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. "ఇన్ని రోజులు చంద్రబాబు చెప్పిన విధంగా ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించాము.. కానీ ఇక నుండి అలా ఉండదు.. ఒక చెంప పై కొడితే రెండు చెంపలు వాయిస్తామని వార్నింగ్  ఇచ్చారు".  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News