బ్రేకింగ్ న్యూస్: ఏపీలో రీ పోలింగ్‌కు టీడీపీ డిమాండ్‌  !!

ఏపీలో అనేక చోట్ల ఈవీఎంలు మెరాయించి చుక్కలు చూపిస్తున్నాయి.

Last Updated : Apr 11, 2019, 04:32 PM IST
బ్రేకింగ్ న్యూస్: ఏపీలో రీ పోలింగ్‌కు టీడీపీ డిమాండ్‌  !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం అందించింది. ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ శాతంపై తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు మోరాయించాయని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ తెలిపారు. ఎక్కడైతే పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందో అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు

ఈసీ ఘోర వైఫల్యం
ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని గోరంట్ల బుచ్చయ్య చౌదరీ విమర్శించారు. సరైన ముందు చూపు లేకుండా ఈసీ ఎన్నికల నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ సరళి సవ్యంగా లేదని విమర్శించారు. ఈవీఎంలు మోరాయించి... సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ లేదా కమలం గుర్తుకు పడుతుందని బుచ్చయ్య చౌదరీ ఆరోపిస్తున్నారు

ఈవీఎం కష్టాలు...
ఏపీలో ఉదయం నుంచి అనేక చోట్ల ఈవీఎంలు మెరాయించి చుక్కలు చూపిస్తున్నాయి. ఈవీఎం పనితీరు వల్ల అటు అధికారులను, ఇటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించడంతో అనేక ప్రాంతాల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సాంకేతిక లోపాల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌ ఆలస్యమైంది. సాంకేతిక కారణాలతో వందల కొద్ది ఈవీఎంలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మేరకు డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చింది

Trending News