Gulab Cyclone Effect: గులాబ్ తుపాను(Gulab Cyclone) నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్ల ప్రయాణాన్ని కుదించింది. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో నాలుగు రైళ్లను రద్దు చేయగా.. ఏడు రైళ్లను దారి మళ్లించారు. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే(East Coast Railway) పరిధిలో ఇవాళ విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు వెళ్లే 6 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను దారి మళ్లించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే.
In view of cyclone “Gulab” supposed to be hit btwn South Odisha & North Andhra Pradesh, it has bn decided to cancel, divert, reschedule,regulate & short terminate below mentioned trains as per following @DRMWaltairECoR @DRMKhurdaRoad @DRMSambalpur pic.twitter.com/lIOj8z75eV
— East Coast Railway (@EastCoastRail) September 25, 2021
నేడు తీరం దాటనున్న 'గులాబ్'..
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్(Gulab) అని పేరుపెట్టారు. కళింగపట్నాని(Kalingapatnam)కి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ(Department of Meteorology) ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీ చేసింది.
Also Read:
75-95 కిలోమీటర్ల వేగంతో గాలులు..
‘తుపాన్ ప్రభావం(Cyclone Effect) ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook