undavalli on CM Kcr: బీజేపీ పాలిట సీఎం కేసీఆర్ సింహా స్వప్నం..ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!

undavalli on CM Kcr: తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 13, 2022, 08:59 PM IST
  • కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ
  • సీనియర్ నేతలతో తెలంగాణ సీఎం మంతనాలు
  • కేసీఆర్‌పై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
undavalli on CM Kcr: బీజేపీ పాలిట సీఎం కేసీఆర్ సింహా స్వప్నం..ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!

undavalli on CM Kcr: తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సీనియర్ నేతలు, రాజకీయ వ్యూహా కర్తలతో సీఎం కేసీఆర్ వరుసగా సమావేశమవుతున్నారు. జాతీయ రాజకీయాలపై మంతనాలు జరిపారు. 

రెండు రోజులపాటు హైదరాబాద్‌లో రాజకీయ వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ మకాం వేశారు. ప్రగతి భవన్‌ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలతోనే సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. నిన్న ప్రగతిభవన్‌ వెళ్లిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్..సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. 
 
ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన..తన ఆలోచన ఒకేలా ఉన్నాయన్నారు. బీజేపీ వైఖరిని వ్యతిరేకించడంలో ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు. బీజేపీని సీఎం కేసీఆర్ గట్టి ఎదురిస్తున్నారని..ఆయనకు ఓ స్పష్టత ఉందని తెలిపారు. 

దేశంలోని పరిస్థితుల పట్ల సీఎం కేసీఆర్‌కు అవగాహన ఉందని..ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ వల్ల దేశానికి ప్రమాదం ఉందన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించిన వాళ్లపై బీజేపీ కేసులు పెడుతోందని ఆరోపించారు. 

Also read:CM Jagan review on Health: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చండి..వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

Also read:Kajal Aggarwal: మాతృత్వంలో తేలుతున్న కాజల్..తాజాగా మరో ఫోటో వైరల్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News