ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ షురూ ; ఓటర్లకు మాత్రమే ఎంట్రీ.. అల్లర్లకు నో ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు

Last Updated : May 6, 2019, 08:42 AM IST
ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ షురూ ; ఓటర్లకు మాత్రమే ఎంట్రీ.. అల్లర్లకు నో ఛాన్స్

దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐదో విడత ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ఈ రోజు  రీపోలింగ్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు పోలింగ్ బూత్ లు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఒక్క పోలింగ్ బూత్ లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
 బారులు దీరిన ఓటర్లు
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. 
భారీ బందోబస్తు ఏర్పాటు
గత అనుభవానాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరి అల్లర్లు జరకకుండా పోలింగ్ కేంద్రాల వద్ద  ఓటర్లను తప్పితే ఎవరికీ పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు.    ఈవీఎంలు మొరాయించడం..రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

 

రీపోలింగ్ పోలింగ్ బూత్ లు ఇవే...
* గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లి గ్రామంలోని 94వ నంబరు పోలింగ్ బూత్
* గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు 244వ నంబరు బూత్‌
* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనూతల గ్రామంలోని 247వ నంబరు పోలింగ్‌ బూత్‌
* నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ నంబరు పోలింగ్‌ బూత్‌
* చిత్తూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆటకానితిప్ప గ్రామంలోని 197వ నంబరు పోలింగ్‌ బూత్‌

Trending News