Modi on Gulab Cyclone: గులాబ్ తుపాను నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ..రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
బంగాళాఖాతంలో(Bay of Bengal)ఏర్పడిన గులాబ్ తుపాను ఉత్తరాంధ్ర తీరంవైపుకు దూసుకొస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయకు చర్యలకు సిద్ధమైంది. గులాబ్ తుపాను నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ(Pm Modi Phone Call to ys jagan) ఇచ్చారు. అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ కోరారు. తుపాను పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను(Gulab Cyclone) తీరం దాటే అవకాశాలున్నాయి. ఆ సమయంలో గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర-ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు(Heavy Rains) పడనున్నాయి. తుపాను హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటయ్యాయి.
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్ని గులాబ్ తుపాను తాకనున్న నేపధ్యంలో తీరం వెంబడి గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి తూర్పున 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న గులాబ్ తుపాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరంవైపుకు దూసుకొస్తోంది.
Also read: Gulab Cyclone: ఉత్తరాంధ్ర వైపుకు దూసుకొస్తున్న గులాబ్ తుపాను, అతి భారీ వర్షాల హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook