/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Pawan Kalyan: టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ తో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఇద్దరూ హీరోలు  మాట్లాడుకుంటే ఎందుకంత వార్త అనుకుంటున్నారా.. వీళ్లద్దరు హీరోలే కాదు.. రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత. ప్రకాష్ రాజ్ గత లోక్ సభ ఎన్నికల్లో  కర్ణాటక నుంచి నుంచి పోటీ చేసి ఓడపోయారు. అందుకే పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ భేటీ ఆసక్తిగా మారింది.

అంతేకాదు రాజకీయంగా ఇద్దరు భిన్న ధృవాలుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. అటు ప్రకాష్ రాజ్ మాత్రం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రకటనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. ప్రకాష్ రాజ్ ను కమలం నేతలు టార్గెట్ చేస్తున్నారు. అందుకే రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్న పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ ఏకాంతంగా మాట్లాడుకోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రకాష్ రాజ్ వచ్చారు. అక్కడే వీళ్లిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సినిమాకు క్లాప్ కొట్టాకా పక్కకు వెళ్లిన నేతలు.. చాలాసేపు గుసగుసలాడుకున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు? రాజకీయాలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగిందా? అన్న చర్చలు సాగుతున్నాయి.

ఏపీలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు పవన్ కల్యాణ్. జిల్లా పర్యటనలు చేస్తున్నారు. దసరా తర్వాత రాష్ట్రవ్యాప్యంగా పర్యటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని కోరుకుంటున్నారు పవన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు ఉంటాయనే చర్చ వచ్చింది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పవర్ స్టార్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో బీజేపీకి టాటా చెప్పేసి.. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని అంటున్నారు. టీడీపీ నేతలు కూడా ఆ దిశగా జనసేనతో చర్చలు జరుపుుతన్నారని సమాచారం. జనసేనతో కలిసి పోటీ చేస్తే.. త్యాగాలకు కూడా సిద్ధమనే సంకేతం ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా టీడీపీతోనే జనసేన ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ప్రకాష్ రాజ్ కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. జాతీయ  స్థాయిలో  పెట్టబోతున్న పార్టీలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపిస్తున్న ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కు అందుకే జాతీయ రాజకీయాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్.. తనతో పాటు ప్రకాష్ రాజ్ ను తీసుకెళ్లారు. కేసీఆర్ ముంబై, చెన్నై, బెంగళూరు పర్యటనల్లో ప్రకాష్ రాజ్ ఉన్నారు. దీంతో తాజాగా పవన్ తో ప్రకాష్ రాజ్ చర్చల్లో కేసీఆర్ జాతీయ పార్టీ అంశంపై చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారు పవన్ కల్యాణ్. బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ హాజరయ్యారు. పవన్ సినిమాకు తెలంగాణ సర్కార్ పలు రాయితీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో  కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది.

Read also: Coivd New Wave: కొవిడ్ కొత్త వేవ్ తో రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే అంతే?

Read also: Chittoor: చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా..  మాజీ మేయర్ హేమలతను ఢీకొట్టిన పోలీస్ జీపు..? గాయాలతో ఆసుపత్రిలో చేరిక    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Pawan Kalyan Prakash Raj Meeting Create Political In Telugu States.. Is Janasena Will Support Kcr Party In Central
News Source: 
Home Title: 

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చలు.. కేసీఆర్ కొత్త పార్టీ గురించేనా?

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చలు.. కేసీఆర్ కొత్త పార్టీ గురించేనా?
Caption: 
FILE PHOTO PAWAN KALYAN
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర సన్నివేశం

పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చ

కేసీఆర్ కొత్త పార్టీపై చర్చించారా?

Mobile Title: 
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చలు.. కేసీఆర్ కొత్త పార్టీ గురించేనా?
Srisailam
Publish Later: 
No
Publish At: 
Friday, June 24, 2022 - 08:27
Request Count: 
86
Is Breaking News: 
No