పవన్ 'గుండు'పై క్లారిటీ ఇచ్చిన పరిటాల కుటుంబం

పవన్ కళ్యాణ్ గుండుకు పెద్ద కహానీయే ఉంది. చాలా మంది పవన్ కళ్యాణ్ కు మాజీమంత్రి పరిటాలరవి గుండు కొట్టించారని అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి.

Last Updated : Jan 30, 2018, 06:41 AM IST
పవన్ 'గుండు'పై క్లారిటీ ఇచ్చిన పరిటాల కుటుంబం

పవన్ కళ్యాణ్ గుండుకు పెద్ద కహానీయే ఉంది. చాలా మంది పవన్ కళ్యాణ్ కు మాజీమంత్రి పరిటాలరవి గుండు కొట్టించారని అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి. ఇప్పటికీ చాలామంది కూడా అదే నిజమని కూడా అనుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గుండుపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. 

పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..!! ఈ పర్యటనలోనే ఆయన పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి పరిటాల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలోనే పరిటాల సునీత పవన్ 'గుండు' అంశంపై స్పందించారు. 

పరిటాల రవి అందరికీ సపోర్టు చేసే మంచి మనిషి అని, ఆయన ఎవరికీ గుండు కొట్టించలేదని చెప్పారు. ఆయన ఎవరికీ ఇబ్బందిపెట్టే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై టీవీల్లో చూడటం, బయట మాట్లాడుకుంటుంటే విన్నామని తెలిపారు. అసలు గుండు కొట్టించే మనస్తత్వం గలవ్యక్తి పరిటాల రవి కానేకాదని చెప్పారు. ఆయన శత్రువులనైనా ప్రేమిస్తారని.. ఇలాంటి వార్తలు ఎలా బయటికి వస్తాయో అర్థంకావని తెలిపారు. 

పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై బహిరంగంగా స్పందించారు. పరిటాల రవి గుండు కొట్టించారు అనడంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అప్పట్లో పరిటాల రవి అంటే తనకు తెలియదని.. సినిమాల్లో విసిగిపోయి గుండు కొట్టించుకున్నానని చెప్పారు.

Trending News