AP Passengers: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చిక్కుకున్నవి రెండు రైళ్లు. ఒకటి షాలిమార్ నుంచి చెన్నైకు వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కాగా రెండవది బెంగళూరు నుంచి హౌరా వెళ్లే యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్. ఈ రెండు రైళ్లలోనూ తెలుగువారు ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై సమాచారాన్ని సేకరించింది. పూర్తి వివరాలు మీ కోసం..
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీకు చెందిన వ్యక్తులు ఎంతమంది రిజర్వేషన్ చేయించుకున్నారు, ఎంతమంది ప్రయాణించారు, ఎంత మంది ఆచూకీ తెలియడం లేదనే కీలకమైన వివరాల్ని రైల్వే శాఖ అందించడంతో ఆ సమాచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వివరాలు
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఏపీ ప్రయాణీకులు 482 మంది ప్రయాణించగా విశాఖ నుంచి 165, రాజమండ్రి నుంచి 22, విజయవాడ నుంచి 80 మందితో కలుపుకుని మొత్తం 267 మంది సురక్షితంగా ఉన్నారు. ఇక విశాఖ నుంచి 11, ఏలూరు, విజయవాడల్నించి 8 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి ఇంకా 76 మంది వివరాలు లభ్యం కాలేదు. ఇక రైళ్లో ప్రయాణం చేయనివారి వివరాల్లో విశాఖ నుంచి 57, ఏలూరు నుంచి 3, విజయవాడ నుంచి 22 మంది మొత్తం 82 మంది ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో సమాచారం లభ్యం కాలేదు. ఈ సంఖ్య మొత్తం 113గా ఉంది.
యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వివరాలు
ఇక యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకు చెందిన 89 మంది ప్రయాణీకులున్నారు. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీరిలో విశాఖ నుంచి 17, రాజమండ్రి నుంచి 3, విజయవాడ నుంచి 21 మంది, బాపట్ల నుంచి 8 మంది ఉన్నారు. విశాఖ నుంచి ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. రిజర్వేషన్ ఉండి ప్రయాణం చేయనివారిలో విశాఖ నుంచి 5, ఏలూరు నుంచి 1, విజయవాడ నుంచి 4 మొత్తం 10 మందిని గుర్తించారు. ఇంకా 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో విశాఖ నుంచి 9, విజయవాడ నుంచి 16, నెల్లూరు నుంచి 3 మంది ఉన్నారు.
ఒడిశా రైలు ప్రమాదానికి గురైనవారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో కొంతమంది తెలుగు వ్యక్తులు ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చీరాల నుంచి హౌరాకు బయలుదేరిన ఆరుగురు తాము క్షేమంగా ఉన్నట్టు వీడియో రికార్డు చేసి స్నేహితులకు పంపించారు.
Also read: Odisha Accident Tragedy: కొడుకు బతికున్నాడా లేడా, మృతదేహాల కుప్పలో వెతుకుతున్న ఓ తండ్రి
అంటే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 113 మంది, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 28 మంది మొత్తం 141 మంది సమాచారం ఇంకా లభ్యం కావల్సి ఉంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని తగిన సమాచారం సేకరించడం, అవసరమైనవారికి చికిత్స, గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook