Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Hero Nikhil Siddhartha Joins In TDP: యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అందరికీ షాక్‌ ఇచ్చాడు. నిఖిల్‌ తీసుకున్న నిర్ణయం సినీ పరిశ్రమను విస్మయానికి గురి చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2024, 10:23 PM IST
Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Nikhil Siddhartha: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో నిఖిల్‌ పచ్చ కండువా కప్పుకున్నాడు. అయితే తన మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్‌ చీరాల అసెంబ్లీ టికెట్‌ లభించడంతో నిఖిల్‌ టీడీపీలో చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పాడు.

Also Read: TDP Candidates List: టీడీపీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల.. వారికి భారీ షాకిచ్చిన చంద్రబాబు

'టీడీపీ చీరాల టికెట్‌ పొందిన మా మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్‌కు శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదం, మద్దతు కావాలి' అని నిఖిల్‌ సిద్ధార్త్‌ ట్వీట్‌ చేశాడు. సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం

ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్‌ గతేడాది 'స్పై' సినిమా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో సంయుక్త మీనన్‌ జోడీగా నిఖిల్‌ 'స్వయంభు' సినిమా చేస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తీకేయ 3' కూడా చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని రోజుల కిందట నిఖిల్‌ తండ్రైన విషయం కూడా తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News