తెలుగు పదానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు

               

Last Updated : Oct 26, 2017, 08:50 PM IST
తెలుగు పదానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు

తెలుగు పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది. "అన్న" అనే పదానికి తెలుగు, తమిళ భాషల్లో సోదరుడు అనే అర్థం వస్తుంది. ఇప్పడు కొత్తగా విడుదలవుతున్న ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ఈ పదానికి చోటు కల్పించనున్నారు ఆ నిఘంటువు సంపాదకవర్గం. గత నెల ఆ నిఘంటువులో తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ మొదలైన భాషలకు చెందిన దాదాపు 70 పదాలకు చోటు కల్పించారు. అందులో ఈ  "అన్న" అనే పదం కూడా ఒకటి. ప్రస్తుతం "Anna" అన్న పదానికి ఈ నిఘంటువులో రూపాయిలో ఆరో వంతుకి సూచకం అనే అర్థం ఉంది, అనగా తెలుగులో "అణా" అని అర్థం. ప్రస్తుతం ఈ పదంతో పాటు సోదరుడు అనే పదం కూడా జోడించారు సంపాదకులు. అలాగే ఉర్దూ పదం 'అబ్బా' (తండ్రి)ను నిఘంటువులో జతచేశారు. ఈ పదంతో అచ్చా, బాపు, బాడా దిన్‌, బచ్చా, సూర్య నమస్కార్‌ వంటి పదాలు కూడా ఈ సంవత్సరం నిఘంటువులో చోటు సంపాదించాయి.   

 

Trending News