యంగ్ గ్లోబల్ లీడర్ గా ఏపీ మంత్రి నారా లోకేష్

Last Updated : Mar 14, 2019, 09:37 PM IST
యంగ్ గ్లోబల్ లీడర్ గా ఏపీ మంత్రి నారా లోకేష్

నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యంగ్ గ్లోబల్ లీడర్స్ ఫోరం తాజాగా విడుదల చేసిన క్లాస్ ఆఫ్ 2019 యువనేతల జాబితాలో నారా లోకేశ్ కూడా ఉన్నారు. సంబంధిత రంగంలో అత్యంత ప్రభాశీలంగా వ్యవహించిందుగాను ఈ అవార్డు ప్రదానం చేస్తారు. కాగా మొత్తం 127 మంది ఉన్న యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేశ్ దక్షిణాసియా విభాగంలో ఉండటం గమనార్హం.

లోకేష్ రియాక్షన్...
గ్లోబల్ యంగ్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2019 తన పేరు ఉండటంపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ వరల్డ్ గ్రూప్ లో తనకు కూడా స్థానం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తనకు ఈ అపురూపమైన గౌరవం దక్కడం పట్ల సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు ఈ జాబితాలో ఉన్న ఇతర యంగ్ లీడర్స్ కు అభినందనలు తెలిపారు. తనతో పాటు ఎంపికైన గ్లోబల్ యంగ్ లీడర్స్ సహచరులతో  మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు.

హర్షం వ్యక్తం చేసిన టీడీపీ వర్గాలు
ఇదిలా ఉండగా యంగ్ గ్లోబల్ ఫోరం జాబితాలో నారాలోకేష్ పేరు ఉడటంపై టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ యువ నాయకుడు నారా లోకేష్ ప్రతిభకు ఇది నిదర్శనమని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. నారా లోకేష్ ను తక్కువ చేసి మాట్లాడే వారు ఇప్పటికైనా తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా చురకలు అంటించారు

 

 

 

Trending News