నామినేషన్లలో టాప్‌ ప్లేస్ లో నంద్యాల ..అట్టడుగు స్థానంలో చిత్తూరు

                                                

Last Updated : Mar 27, 2019, 02:27 PM IST
నామినేషన్లలో టాప్‌ ప్లేస్ లో నంద్యాల ..అట్టడుగు స్థానంలో చిత్తూరు

ఏపీలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో నామినేషన్ల జాబితాను ఈసీ ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన సమచారం ప్రకారం ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు  548 దాఖలయ్యాయి.అలాగే రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3,925 నామినేషన్లు దాఖలయ్యాయి. 

లోక్ సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా నంద్యాలకు 38 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా చిత్తూరుకు 13 వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నంద్యాల  అత్యధికంగా  61 నామినేషన్లు నమోదు కాగా... అత్యల్పంగా పార్వతీపురం, పాలకొండ స్థానాల్లో పదేసి నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు పరిశీలన వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 118 అసెంబ్లీ స్థానాలకు 15కి పైగా నామినేషన్లు వచినట్లు సమాచారం. 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది మీడియీతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 15 మంది దాటితే రెండో బ్యాలట్‌ యూనిట్‌, 32 కంటే ఎక్కువ మంది ఉంటే మూడో బ్యాల్‌ట్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నామినేషన్ల ఉపసంహణ చేసుకున్న తర్వాత ఎంత మంది పోటీ ఉన్నారనే విషయం తెలుస్తుందన్నారు. దీని బట్టి బ్యాలె ట్‌ యూనిట్లుపై నిర్ణయం ఉంటుందని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.

Trending News