నారా లోకేష్ నామినేషన్ లో తప్పులు !! లాయర్ జోక్యంతో హైడ్రామాకు తెర

                 

Last Updated : Mar 26, 2019, 08:06 PM IST
నారా లోకేష్ నామినేషన్ లో  తప్పులు !! లాయర్ జోక్యంతో హైడ్రామాకు తెర

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నారా లోకేష్ కు  ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నామినేషన్ సమయంలో దాఖలు చేసిన పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి లోకేష్ నామినేషన్ ను పక్కన పెట్టినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 
 

నామినేసన్ పై వైసీపీ ఫిర్యాదు
ప్రముఖ మీడియా కథనం ప్రకారం నారా లోకేష్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన వైసీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ చెల్లుబాటు కాదని.. పరిశీలన సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు లోకేష్ నామినేషన్ ను హోల్డ్ లో పెట్టారు .లోకేష్ పై పోటీకి దిగుతున్న వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు కలకలం రేపింది. 

 

అభ్యంతరాలు ఇవే :
ప్రముఖ మీడియా కథనం ప్రకారం లోకేష్ నామినేషన్ పత్రాల్లో  ఇంటి అడ్రస్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నట్లు చూపించారు. అయితే నోటరీ మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన సీతారాం అనే లాయర్ చేశారు. తన పరిధిలోకిరాని గ్రామాన్ని.. మరో ప్రాంతంలో ఎలా నోటరీ చేయిస్తారని.. వైసీపీ  అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నోటరీ చట్టంలోని సెక్షన్-9ని లేవనెత్తారు. వైసీపీ  అభ్యంతరంపై అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణ నెలకొంది.

 

24 గంటల గడువు..
వైసీపీ అభ్యంతరాలపై లోకేష్ తరఫున లాయన్ ను సంప్రదించారు అధికారులు. తాజా పరిణామంపై మీ సమాధానం ఏంటని లోకేషన్ తరపు లాయర్లను ప్రశ్నించారు.  కొంత సమయం ఇస్తే సరైన పత్రాలు సమర్పిస్తామని  లాయర్ హామీ ఇచ్చారు. దీంతో రిటర్నింగ్ అధికారి.. నామినేషన్ కు సంబంధించిన సరైన పత్రాలు ఇవ్వాలంటూ లోకేష్ కు 24 గంటల సమయం ఇచ్చారు.

 

ఉత్కంఠతకు  తెర... 
నారా లోకేష్ నామినేషన్ లో దొర్లిన తప్పులను సరి దిద్దిన లోకేష్ తరఫున న్యాయవాది .. మళ్లీ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినట్లు తెలిసింది. మరోక నోటరీ సమర్పించడంతో లోకేష్ నామినేషన్ కు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీంతో లోకేష్ నామినేషన్ విషయంలో  ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది.  దీంతో  టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 

Trending News