Roja Vs Nagababu: మూసుకుని ఉండు.. నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు.. నాగబాబుకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

Minister Roja Strong Counter To Nagababu: టీడీపీ-జనసేన మాట్లాడుకున్న మాటలనే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదంటూ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. నాగబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 07:23 AM IST
  • నాగబాబుపై మంత్రి రోజా ఫైర్
  • ఏపీ గురించి మీకున్న జ్ఞానం శూన్యం
  • విషయం తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉంది
Roja Vs Nagababu: మూసుకుని ఉండు.. నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు.. నాగబాబుకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

Minister Roja Strong Counter To Nagababu: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు, మంత్రి రోజా మధ్య వార్ ముదురుతోంది. నీది నోరు అనుకోవాలా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా అనుకోవాలా అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలన్నారు. లేదంటే మూసుకుని కూర్చొవాలని పరోక్షంగా చెబుతూ ఎమోజీ యాడ్ చేశారు. నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదని హితవు పలికారు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం మీకే చెల్లుతుందన్నారు. ఏపీ గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసని.. తన శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నాగబాబు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఆమె ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు రోజా. 

 

తాను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక భారత్‌లో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉందని మంత్రి రోజా తెలిపారు. ఈ విషయం తెలియకుండా నాగబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఏనాడు చిరంజీవి కేంద్ర మంత్రిగా పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని రాజకీయంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని కాబట్టి తాను అస్సలు మాట్లాడనని అన్నారు.

గతంలో టీడీపీ-జనసేన మాట్లాడుకున్న మాటలనే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదన్నారు మంత్రి రోజా. గతంలో వాళ్లు ఏం మాట్లాకున్నారో చూపించేందుకు ఆ వ్యక్తికి ఈ వీడియో చేరాలని షేర్ చేస్తున్నానని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద శత్రుత్వం లేదన్నారు. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగానే తన వ్యాఖ్యలుంటాయన్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. తనను అంత మాటలు అన్నా.. తాను కూడా ఓ మాట అనొచ్చని కానీ తన సంస్కారం అడొచ్చిందని నాగబాబుకు చురకలు రోజా అంటించారు.

అంతకుముందు మంత్రి రోజాపై నాగబాబు ఘాటు పదజాలంతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు. చూస్తూ చూస్తూ మునిసిపాలిటీ కుప్పతొట్టిలో ఎవ్వరూ వేలు పెట్టరని.. అందుకే నువ్వు మా అన్నయ్య చిరంజీవిని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఎన్ని మాటలు అన్నా తాను స్పందించడం మానేశానని అన్నారు. ఈ మేరకు నాగబాబు మీడియాకు ట్విటర్ ద్వారా ఒక వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. 

Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  

Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News