Viral news: గోదారోళ్లా.. మజాకా..! అల్లుళ్లకు 365 రకాల వంటలతో విందు భోజనం!

Viral news: గోదారోళ్లు ఆతిథ్యానికి మారుపేరు. పండుగకు అల్లుడు వస్తున్నాడంటే..మర్యాదలు మూమూలుగా ఉండవు. అయితే ఇంకా ఇంటి అల్లుడు కాకుండానే సంక్రాంతి అంటే ఏంటో చూపించారు అత్తింటివారు. రికార్డుస్థాయిలో వంటకాలను వడ్డించి అల్లుడికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 02:14 PM IST
  • గోదారి అల్లుడికి ఆతిథ్యం
  • 365 రకాల వంటలతో విందు భోజనం
  • పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఘటన
Viral news: గోదారోళ్లా.. మజాకా..! అల్లుళ్లకు 365 రకాల వంటలతో విందు భోజనం!

West Godavari news: సంక్రాంత్రి వచ్చిందంటే చాలు..గోదావరి జిల్లాలు కొత్త అల్లుళ్లు, కోడిపందాలతో కళకళ్లాడుతాయి. గోదారోళ్లు మర్యాదలు మామూలుగా ఉండవు. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలు వడ్డించి...రాచమర్యాదలు చేస్తారు. కొత్త అల్లుళ్లకు అయితే ఇది కాస్తా ఎక్కువగానే ఉంటుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి (Narsapuram) చెందిన ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో (365 Different Types of Food) ఆతిథ్యమిచ్చి..ఆశ్చర్యపరిచింది. 

పశ్చిమగోదావరి జిల్లాకు (West Godavari) చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరరావు కుమార్తె కుందవి. ఈ అమ్మాయికి.. తణుకుకు చెందిన ఎన్నారై  తుమ్మలపల్లి సాయి కృష్ణతో వివాహం నిశ్చయమైంది. జిల్లాలోని నరసాపురానికి చెందిన కుందవి తాతయ్య గోవింద్, అమ్మమ్మ నాగమణి.. కాబోయే వధూవరులను సంక్రాంతి సందర్భంగా తమ ఇంటికి ఆహ్వానించారు. కాబోయే మనవడికి 365 రకాల వంటలను రుచి చూపించారు. 

Also Read: Nandamuri Balakrishna: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్

హోటల్ మెనూనే చిన్నబోయేలా..
365 వంటకాల్లో అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనం, చపాతీ, పరోటా, బటర్ నాన్, తందూరీ రోటీ వంటి వంటలు సిద్దం చేయించారు. అందులో 30 రకాల కూరలు, 100 రకాల స్వీట్లు, 75 రకాల హాట్ ఐటమ్స్, 15 రకాల ఐస్ క్రీమ్స్, 35 రకాల కూల్ డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు, ఇతర పదార్థాలతో డైనింగ్ టేబుల్ ను నింపేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇందులో ఒక్క నాన్ వెజ్ ఐటమ్ లేదు. 

నాన్‌వెజ్‌ ఐటమ్స్‌తో మరో అల్లుడికి..
ఇదే తరహాలో మరో కుటుంబం నాన్‌వెజ్‌ (Non-veg) ఐటమ్స్‌తో అల్లుడికి విందు భోజనం పెట్టారు. కొబ్బరి ఎగుమతుల వ్యాపారి మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మిల కుమార్తె యశోదసాయి, అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల ఐటమ్స్‌ సిద్ధం చేసి భోజనం పెట్టారు. సొర, కొరమీను, వంజరం, కట్టెపరిగె, పండుగప్ప, సందువా తదితర రకాల చేపల కూరలు వడ్డించారు. చింతకాయ, పచ్చిరొయ్యలు, చింతచిగురు రొయ్యలు, చింతాకు, చిన్నచేపలు తదితర వంటలు వండారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News