Kgf 2 Movie: కేజీఎఫ్2 మూవీ థియేటర్లో విషాదం

Kgf 2 Movie: ఆలిండియా లెవల్లో సౌతిండియన్ మూవీ ఇండస్ట్రీ సత్తా చాటిన సినిమా కేజీఎఫ్‌-2. విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్న థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. అయితే ఆంధ్రప్రదేశ్ లో కేజీఎఫ్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లలో  విషాదం చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 06:20 PM IST
  • హవా తగ్గని కేజీఎఫ్ 2
    కలెక్షన్ల వసూళ్లలో దూకుడు
    ఏపీలో కేజీఎఫ్ మూవీ థియేటర్లో విషాదం
Kgf 2 Movie: కేజీఎఫ్2 మూవీ థియేటర్లో విషాదం

Kgf 2 Movie: ప్రశాంత్‌ నీల్ డైరక్షన్‌లో రాకింగ్‌ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఇండియన్ సినీ చరిత్రలో ఓ హిస్టరీగా నిలిచిపోయింది. వసూళ్లలో ఆల్‌ టైం గ్రేట్ లిస్ట్ లో రెండో స్థానం కైవసం చేసుకుంది. విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా మూవీపై క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. ఇండియాతో పాటు వరల్డ్‌ వైడ్ గా బాక్సాఫీసును షేక్ చూస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది కేజీఎఫ్-2. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. తాజాగా 1200 కోట్ల మార్కును కూడా క్రాస్ చేసింది. కొత్త రికార్డు దిశగా ఇంకా కలెక్షన్లు సాధిస్తోంది. కేజీఎఫ్ 2 మూవీ బాలీవుడ్‌లోనూ భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపు 420 కోట్ల కలెక్షన్లు సాధించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కేజీఎఫ్‌ మూవీ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో విషాదకర సంఘటన జరిగింది. ఏలూరులో సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆ వ్యక్తి మృతికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు.

కర్నాటకలోనూ కేజీఎఫ్‌-2 మూవీ ప్రదర్శనిస్తున్న థియేటర్లో కాల్పుల ఘటన ఆ మధ్య కలకలం రేపింది. వెనకున్న వ్యక్తి తన సీటుపై కాలేశాడనే కారణంతో తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. మూడు తూటాలు దూసుకుపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు హాస్పిటల్ లో చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఇప్పుడు ఏపీలో సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు.

also read: Namitha Pregnant: 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్!

also read: Mahesh babu comments on Ministry : తనకు హెల్త్ మినిస్త్రీ కావాలంటున్న మహేశ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News