/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Last karthika Somavaram 2023: కార్తీకమాసం రేపటితో ముగియనుంది. రేపే చివరి కార్తీక సోమవారం కావడంతో (Last karthika Somavaram 2023) శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తుత్తున్నారు. నిన్నటి నుంచి మల్లన్నను దర్శించుకునేందుకు తరలివెళ్తున్నారు. దీంతో శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు ఘాట్ రోడ్డు వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది సుమారు 8 కిలోమీటర్ల మేర ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు శ్రీశైలేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు.  ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. 

రేపే చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆలయ నిర్వాహకులు భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో శని, ఆది, సోమవారాలలో సర్వదర్శన అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం అందరికీ అలంకార దర్శనం‌ మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భారీగా జనాలు స్వామివారి దర్శనానికి వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుంచి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు దేవస్థానం సిబ్బందితోపాటు పోలీసు అధికారులు శ్రమిస్తున్నారు. మరోపక్క శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 

Also read: Chandrababu: ఏపీ రైతులను ఆదుకోవాలని... ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Last karthika Somavaram 2023: Huge Rush in Srisailam Mallikarjuna Swami temple
News Source: 
Home Title: 

Srisailam: రేపే చివరి కార్తీక సోమవారం.. మల్లన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..

Srisailam: రేపే చివరి కార్తీక సోమవారం.. మల్లన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..
Caption: 
File photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Srisailam: రేపే చివరి కార్తీక సోమవారం.. మల్లన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
Yes
Publish At: 
Sunday, December 10, 2023 - 19:25
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Request Count: 
26
Is Breaking News: 
No
Word Count: 
197