సీఎం రమేశ్ దీక్షకు కరుణానిధి కుమార్తె సంఘీభావం

కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌కు, డీఎంకే నేత కరుణానిధి కుమార్తె కనిమొళి సంఘీభావం ప్రకటించారు.

Last Updated : Jun 26, 2018, 05:11 PM IST
సీఎం రమేశ్ దీక్షకు కరుణానిధి కుమార్తె సంఘీభావం

కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌కు, డీఎంకే నేత కరుణానిధి కుమార్తె కనిమొళి సంఘీభావం ప్రకటించారు. స్వయంగా కడపకు వచ్చి ఆమె దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతీయులను మోసం చేయడానికే కేంద్రం కంకణం కట్టుకుందని తెలిపారు. హామీలను కేంద్రం నెరవేర్చకపోవడానికి అడ్డమేంటని.. వాటిని వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ రోజుతో ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేశ్, బీటెక్ రవిలు చేస్తున్న దీక్ష ఏడవ రోజుకి చేరింది. ఈ దీక్షా స్థలానికి వచ్చి ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమా మహేశ్వరరావు మొదలైన వారు సంఘీభావం తెలిపారు. గతం వారం రోజులుగా ఈ దీక్షా స్థలానికి తెలుగుదేశం నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా వచ్చి మద్దతు తెలిపారు. 

సీఎం రమేశ్ దీక్షకు డీఎంకే ఎమ్మెల్యేలు ఆర్ గాంధీ (రాణీపేట), కె మోహన్ (అన్నా నగర్) మొదలైన వారు కూడా మద్దతిచ్చారు. కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం సీఎం రమేశ్ చేస్తున్న దీక్షను గుర్తించి కేంద్రం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.

Trending News