ప.గో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన నామినేషన్‌ను తీసుకొనేందుకు రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. భీమవరం అసెంబ్లీ స్థానంలో బరిలోకి నిలిచేందుకుగాను ఆయన నామినేషన్ వేసేందకు బీమవరంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వచ్చారనే కారణం చెబుతూ అధికారులు ఆయన నామినేషన్ పత్రాలు తీసుకోలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ స్వీకరణకు గడవు విధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భగా కేఈ పాల్ మీడియాతో ముందుకు వచ్చి తన ఆవేదన తెలియజేశారు. తన తరఫున ఓ ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లాడన్నారు. అనంతరం కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం అయిపోయిందంటూ తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని పాల్ పేర్కొన్నారు