చంద్రబాబు తరహా... ఈసీకి ప్రశ్నలు సంధించిన కేఏ పాల్ !!

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్... ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈసీ పలు ప్రశ్నలు సంధించారు

Last Updated : Apr 17, 2019, 02:03 PM IST
చంద్రబాబు తరహా... ఈసీకి ప్రశ్నలు సంధించిన కేఏ పాల్ !!

గత కొన్ని రోజులుగా ఈసీ తీరు తప్పుబడుతూ వస్తున్న  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన స్వరాన్ని మరింత పెంచారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి  పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీన వెళ్లిన పాల్..ఈ మేరకు సీఈసీకి వినతిపత్రం అందించారు. ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ లిఖిత పూర్వకంగా సమాధానం కావాలన్నారు ..  పాల్ సంధించిన ప్రశ్నలను ఒక్క సారి పరిశీలిద్దాం....

* పోలింగ్ ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు..జాప్యానికి కారణం చెప్పండి ?
* పోలింగ్ ప్రక్రియను నిర్ణీత గడవు లోపు పూర్తి చేయకుండా.. అర్థరాత్రి వరకు  ఎందుకు కొనసాగించారు ?
* ఈవీఎంలో 12వ ( ప్రజాశాంతి పార్టీ ) బటన్ నొక్కితే 2వ (వైసీపీ) బటన్‌కు ఓటుపడుతోంది.. .దీనిపై వివరణ ఇవ్వగలరా ?
* నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచెయ్యలేదు..దీనిపై సమాధానం చెప్పండి ?
* పోలింగ్ పర్యవేక్షకులు దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు నియమించారు ?
* వీవీప్యాట్ స్లిప్పు కు 3 సెకండ్లు ఎందుకు పట్టింది ?
* పోలింగ్ సమయంలో దాడులను ఎందుకు నియంత్రించలేకపోయారు ?
* ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా ఎందుకు తీసుకోలేదు ?

 

Trending News