సీఎం జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు: జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan On Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 3 క్యాపిటల్స్, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటూనే.. మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని సీఎం జగన్ చెప్పడం ప్రజలను గందరోళానికి గురిచేసిందని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 11:24 AM IST
సీఎం జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు: జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan On Jagan: మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ప్రజలను మరింత గందరగోళానికి గురచేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 3 క్యాపిటల్స్ ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీలో చెప్పిన సీఎం జగన్.. మరోసారి మూడు రాజధానుల కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నామని చెప్పడం మరింత గందరగోళానికి గురిచేశారని చెప్పారు.  రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందని ఓ ప్రకటనలో తెలియజేశారు.

కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. రాష్ట్ర రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు, మూడు రాజధానులు లేవనే విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే  వైసీపీ నాయకులు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు.

‘‘రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారు. 33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి. అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులపై పలు చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3 వేలకు పైగా కేసులు పెట్టారు. మహిళలపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఒకే రాజధాని కావాలని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే మాటపై నిలిస్తే ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోంది. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.  

Also Read: ట్రైనింగ్ లో తోటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి..

Also Read: మీ పతనం చూడాలనే.. చంద్రబాబుపై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News