చేతగాని వాడికి కోపం ఎక్కువ.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు

                                   

Last Updated : Mar 20, 2019, 06:18 PM IST
చేతగాని వాడికి కోపం ఎక్కువ.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు

ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ ..ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో దుమ్మత్తిపోశారు. జగన్ ను తిట్టి ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. జగన్ తిడితే ఓట్లు రావు... ఐదేళ్ల కాలంలో తాను ఏం చేశారో చెప్పాలని.. అప్పుడే జనాలు నమ్ముతారు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని జగన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రాబుపై జగన్ సెటైర్లు సంధించారు. చేతగాని వాడికి కోపం ఎక్కవ.. పనిచేయలేని వాడికి ఆకలి ఎక్కువ అనే సామెత ఉంది..చంద్రబాబు పరిస్థితి కూడా అంతే ఉందని జగన్ ఎద్దేవ చేశారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ తో కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారని విమర్శించారు. దుర్మార్గపు పాలను చూసి..టీడీపీ అంటేనే జనాలు చీదరించుకుంటున్నారని.. పార్టీ కండువా కప్పుకునేందుకు కార్యకర్తలు సైతం జంకుతున్నారని జగన్ ఎద్దేవ చేశారు
 

Trending News