ఏపీలో మరోమారు ఐటీ దాడుల కలకలం; ఈ సారి టార్గెట్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

రాజకీయ నేతలే టార్గెట్ చేసుకొని ఎన్నికల వేళ  ఐటీ అధికారులు మరోమారు దాడులు నిర్వహించారు

Last Updated : Apr 10, 2019, 04:31 PM IST
ఏపీలో మరోమారు ఐటీ దాడుల కలకలం; ఈ సారి టార్గెట్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

ఏపీలో మరోమారు ఐటీ దాడుల కలకలం రేగుతోంది. ఈ సారి గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పై అధికారులు గురిపెట్టారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం సోమవారం అర్థరాత్రి సమయంలో గల్లా జయదవ్ కార్యాలయంతో పాటు ఆయన అకౌంటెంట్ గుర్రప్పనాయుడిని ఇంట్లో ఆసక్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుర్రప్పనాయుడిని ఆరు గంటల పాటు విచారించినట్లు తెలిసింది. 

రాజకీయ దుమారం...

గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్ధిగా గల్లా జయదేవ్ మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఐటీ సోదాలు నిర్వహించడం గమనార్హం.కాగా ఎన్నికల వేళ ఐటీ దాడులు రాజకీయం దుమారం రేపుతున్నాయి. ఐటీ దాడులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉద్దేశ పూర్వకంగా  దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మోడీ ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శలు సంధిస్తున్నారు.

జయదేవ్ రియాక్షన్..

ఐటీ దాడులపై  ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ జయ్ దేవ్ గుంటూరులోని పట్టాభిపురం పీఎస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ టీడీపీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వేళ కావాలనే టీడీపీని దెబ్బకొట్టేందుకు మోడీ సర్కార్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని జయదేవ్ విమర్శించారు

Trending News