ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు..

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపి.. మరోసారి తన సత్తా చాటింది. తాజా ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 08:39 AM IST
ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు..

PSLV-C56 launch mission live updates: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఉదయం 6.31 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 420కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 వాహకనౌక స్పేస్ లోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌-సార్‌(DS-SAR) ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది. ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగాన్ని సక్సెస్ పుల్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇస్రో. 

360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ఈ శాటిలైట్ అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. దీంతోపాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM (VELOX-AM), ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్-ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2(SCOOB-II), IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్(NuLION), గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపింది ఇస్రో. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ డా. సోమనాథ్. అంతేకాకుండా ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు.

Also Read: Godavari Floods: భయపెడుతున్న గోదావరి ఉగ్రరూపం, కోనసీమను ముంచెత్తిన వరద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News