అమరావతి: మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని లేఖ ద్వారా తెలియజేశారు.
నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని, అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కానని, నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని అన్నారు. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరని ఆయన అన్నారు.
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము - JanaSena Chief @PawanKalyan pic.twitter.com/iBJJ4JX0KC
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2020
ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని, చివరగా ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..