Rains Alert: ఏపీ, తెలంగాణకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు

Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి గాలులు తోడైతే బారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 06:11 AM IST
Rains Alert: ఏపీ, తెలంగాణకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు

Rains Alert: జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు. అక్కడక్కడా కొన్ని వర్షాలు తప్ప పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో అన్నదాతల్లో సైతం దిగులు ఏర్పడింది. అందుకే ఇప్పుడు వర్షాలపై ఐఎండీ చేసిన సూచనలు రైతుల్లో ఆనందం రప్పిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా బర్మా ప్రాంతాల్నించి మేఘాలు ఇటు వస్తున్నాయి. అటు అరేబియా ముద్రం నుంచి కూడా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవైపుకు మేఘాలు విస్తరిస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. గాలుల వేగం పెరిగితే భారీ వర్షాలు కూడా పడనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ అయింది. ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే ఇందుకు కారణమని ఐఎండీ వెల్లడించింది. నిన్న కూడా తెలంగాణ, ఏపీల్లో కొన్ని చోట్ల భారీ వర్షం పడింది.

వాస్తవానికి జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో అసలు పెద్దగా వర్షాల లేవు. దీనికి తోడు భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దట్టమైన మేఘాలు తెలుగు రాష్ట్రాల్లో ఆవహించి ఉండటంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రానున్న మూడ్రోజుల్లో ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. 
ఇవాశ ఉదయం 10 గంటల తరువాత విజయవాడ, పాలకొల్లు, మచిలీపట్నంతో పాటు వరంగల్, పెద్దపల్లి, రామగుండం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమురం బీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు రానున్నాయి.

ఇవాళ మద్యాహ్నం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మాత్రం వర్షాలు పడే సూచనలు లేవు. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండవచ్చు. 

Also read: Outsourcing Employees Salaries: విద్యుత్ ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News