కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి !

                               

Last Updated : Jul 13, 2018, 01:05 PM IST
కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి !

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ ఈ రోజు తెరపడనుంది. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం. ఈ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకోనున్నటు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు పాల్గొంటున్నారు. కాగా కిరణ్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ వీడిన మాజీలు కూడా తిగిన కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు తెలిసింది..

రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ..అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకోవడం..ఎన్నికల్లో దారుణంగా విఫలమవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తదనంతరం ఆయన 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా ఇటీవలే ఆయన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ ఛాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు కిరన్ కుమార్ రెడ్డి అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చిన కిరణ్ ..ఈ రోజు రాహుల్ సమక్షంగా తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు మూహుర్తం ఖరారు చేసుకున్నారు.

Trending News