Food Poisoning in School: మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులకు అస్వస్థత!

Food Poisoning in School: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 04:57 PM IST
Food Poisoning in School: మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులకు అస్వస్థత!

Food Poisoning in School: పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా.. వారిలో 42 మంది వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఈ సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించారు. వారందరికి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. అధికారులను ఆదేశించారు. 

అయితే చికిత్స పొందిన తర్వాత విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని.. ఆరోగ్యం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి స్పష్టం చేశారు. పాడైన కోడిగుడ్లను తినడం వల్లనే విద్యార్థులను అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.  

Also Read: Devineni Uma Arrest: వరుసగా రెండో రోజు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్టు.. కారణమిదే!

Also Read: KCR Jobs Announcement: ఏపీలోనూ కేసీఆర్‌కు క్రేజ్.. సీఎం చిత్ర పటానికి పాలాభిషేకాలు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చే

Trending News