పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. త్వరలోనే విజయవాడ నుండి పుట్టపుర్తి, కడప లాంటి ప్రాంతాలకు విమాన సేవలు లభించే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవలే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ సూచించిన అంశాల ప్రకారం విజయవాడ నుండి అదనపు సర్వీసులు ఇతర దగ్గరున్న ప్రాంతాలకు కూడా వేస్తే బాగుంటుందన్న విషయంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం విశాఖపట్నం నుండే ఇతర ప్రాంతాలకు విమాన సేవలు లభిస్తుండగా.. ప్రస్తుతం విజయవాడకు కూడా వాటిని విస్తరించాలని భావిస్తున్నారు అధికారులు. ఒకవేళ విజయవాడ నుండి పుట్టపర్తికి వెళ్లే సర్వీసు అమలులోకి వస్తే.. భవిష్యత్తులో ఈ సేవలను కుప్పం, నాగార్జునసాగర్ ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.