Kodali Nani: జగన్ వినాశనానికి వైఎస్ వివేకా కుటుంబం ప్రయత్నించింది.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani Sensational Comments On YS Vivekanadareddy Family:  వైఎస్ వివేకా కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వినాశానికి వివేకా కుటుంబం ప్రయత్నించిందంటూ ఆరోపించారు. వివేకా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. చనిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభమంటూ కామెంట్స్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 11:05 AM IST
  • వైఎస్ జ‌గ‌న్ అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం..
  • విజయమ్మపైనే వైఎస్ వివేకా పోటీ చేశారు
  • ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: కొడాలి నాని
Kodali Nani: జగన్ వినాశనానికి వైఎస్ వివేకా కుటుంబం ప్రయత్నించింది.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani Sensational Comments On YS Vivekanadareddy Family: వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తామ‌ని మాజీ మంత్రి  కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని.. అవన్నీ తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేలా ప్రతి ఒక్క  ఎమ్మెల్యే పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం రాత్రి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

'కుక్కకాటుకు చెప్పుదెబ్బలా.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో పాటు పచ్చమీడియాకి జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టాడో కూడా చెప్తాం. రాష్ట్రంలో దోచుకున్న డబ్బును అతని వాళ్లకు ఎలా పంచిపెట్టాడు అనేది కూడా వివరిస్తాం. వైఎ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. 

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. ఇంకా ఐటీ నావల్లే వచ్చిందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు. చెత్త పుస్తకాలు వేస్తే ఎవడు చూస్తాడు.. అవి చలిమంట వేసుకోడానికి కూడా పనికిరావు. "ఎన్టీఆర్‌ని తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు.." అన్నది రాయమనండి. తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చూసి.. ఆనందించింది ఎవరు..? అనేది పుస్తకాలు వేయాల్సింది. మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. టీడీపీని లాక్కున్నాడు. దేనికీ పనికి రాని పప్పుగాడిని ఓ నాయకుడిలా ప్రజల మీదకు వదిలాడు..' అంటూ నాని కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డిపై కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని జగహన్‌రెడ్డిగారు పెడితే.. వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉండి.. విజయమ్మపైనే పోటీ చేశారని గుర్తుచేశారు. వివేకానందరెడ్డి బతికున్నా.. చనిపోయినా..  కడప ఎంపీ సీటును అవినాష్‌ రెడ్డికే జగన్ ఇచ్చేవారని అన్నారు. జగన్ వినాశానికి వైఎస్ వివేకా కుటుంబం ప్రయత్నించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. చనిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభం అని అన్నారు. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచారని అన్నారు. 

'ఆయన చనిపోయిన రోజుకి వివేకా పేరున ఐదుపైసలు ఆస్థి ఉందా..? ఆయన ఆస్తి మొత్తం కూతురు, భార్య, అల్లుడి పేర్ల మీద ఎలా బదిలీ అయ్యాయి..? ఎందుకు ఆ ఆస్తులన్నీ బదిలీ అయ్యాయో తెలియాలి. చంద్రబాబు లాంటి‌ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి.. కేసును తారుమారు చేస్తాడని సీబీఐ విచారణ కోరాం. మా ప్రభుత్వం వచ్చాక మేం విచారించుకుంటాం అని సీబీఐ విచారణ వద్దన్నాం.. సీబీఐ ఊళ్లోకి రావద్దంటూ చెప్పింది, జీవో ఇచ్చింది చంద్రబాబే.. అలా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా వివేకానందరెడ్డి గారిని చంపించింది చంద్రబాబే అని మా అనుమానం..' అని కొడిలి నాని మాట్లాడారు.

Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  

Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News