సమయం పొడిగించేది లేదు... గడువు లోపు వస్తేనే ఓటు వేసే ఛాన్స్ - ఈసీ

ఏపీలో రాజకీయ పార్టీల అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది

Last Updated : Apr 11, 2019, 05:08 PM IST
సమయం పొడిగించేది లేదు... గడువు లోపు వస్తేనే ఓటు వేసే ఛాన్స్ - ఈసీ

ఈవీఎంలు మొరాయించడంతో రాష్ట్రంలో చాల చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశముందని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్ సమాయాన్ని పెంచాలని కోరుతున్నాయి. అందుకు ఈసీ నిరాకరించింది. అయితే గడువు లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటే ఎంత రాత్రయినా ఓటేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు

అవన్నీ వదంతులే...

ఒకరికి ఓటు వేస్తే మరోక పార్టీకి పడుతున్నాయని ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీలు ఆరోపిస్తున్నాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ అంశం ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందిచారు.  రాజకీయ పార్టీలు  చెబుతున్నట్లు ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వెళ్లింది అనేవన్నీ వదంతులేనని స్పష్టంచేశారు. 

Trending News