Earthquake : ప్రతి ఏటా వర్షా కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వస్తున్నాయి. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అధికారులు కూడా ధృవీకరించారు. కాని ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.
జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతో పాటు మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో పలుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు. భూ ప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయి. కొన్ని వస్తువులు కిందపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో పలుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. వరుసగా వస్తున్న ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
Read also: Supermoon: వినీలాకాశంలో అరుదైన అద్భుతం.. భూమికి దగ్గరగా కనువిందు చేయనున్న సూపర్ మూన్
Read also: TS Polycet 2022: తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇలా చేయండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook