Golden Chance: లక్కీ చాన్స్‌కు రేపే ఆఖరి రోజు.. త్వరపడకపోతే అదృష్టం చేజారే ప్రమాదం

Golden Chance For Liquor Business Last Date For Wines Applications: త్వరపడండి అద్భుత అవకాశం మళ్లీ చేజారిందంటే కోట్ల వ్యాపారం చేజారినట్టే. మద్యం వ్యాపార దుకాణాలకు బుధవారం చివరి రోజు కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 8, 2024, 05:38 PM IST
Golden Chance: లక్కీ చాన్స్‌కు రేపే ఆఖరి రోజు.. త్వరపడకపోతే అదృష్టం చేజారే ప్రమాదం

Golden Chance To Liquor Business: కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ క్రమంలోనే మద్యం దుకాణాలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మద్యం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అదృష్టం కలిసొస్తే కోట్లలో లాభపడుతారు. అలాంటి బంగారు అవకాశానికి రేపే ఆఖరి రోజు. దరఖాస్తులు సమర్పించేందుకు ఒక్క రోజే మిగిలి ఉంది. మద్యం వ్యాపారం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే చివరి రోజు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలంగాణతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో దరఖాస్తులు పెంచుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లాటరీ ఎంపిక విధానం కావడం.. రూ.2 లక్షల డిపాజిట్‌ కావడంతో వ్యాపారులు ఆసక్తి కనబర్చడం లేదని సమాచారం.

Also Read: AP Liquor Policy: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. బిర్యానీ కన్నా తక్కువ ధరకే మద్యం

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా..  మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 20,310 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులకు రేపటితో (బుధవారం) గడువు ముగియనుండడంతో పోటీ పడేందుకు పెద్ద ఎత్తున వ్యాపారులు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.406 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన

 

ఒక్కసారి చెల్లించాక మళ్లీ ప్రభుత్వానికి రాకపోవడంతో (నాన్ రిఫండబుల్ రుసుము) ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం లభించింది. బుధవారం సాయంత్రంతో దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే వ్యాపారులు కూడా ముహూర్త బలం చూసుకుని దరఖాస్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్క సోమవారం రోజే 12,036 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి ఈ నెల ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చిన దరఖాస్తుదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి దుకాణాలు కేటాయించనున్నారు. కలెక్టర్‌, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు చెందిన అధికారుల సమక్షంలో లాటరీ తీయనున్నారు.

దరఖాస్తు డిపాజిట్‌ అత్యధికంగా ఉన్నా కూడా మద్యం వ్యాపారం లాభదాయకం కావడంతో పోటీదారులు భారీగా ఉంటున్నారు. అయితే సిండికేట్‌ అయి కొందరు ఇతరులకు అవకాశం లభించకుండా తమ వారికే దుకాణం దక్కేలా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిష్పక్షపాతంగా లాటరీ జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా మద్యం వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశంగా భావించి పోటీదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆఖరి రోజు భారీగా దరఖాస్తులు వస్తాయని.. దరఖాస్తుల మొత్తం ఆదాయం రూ.600 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News