తితిదేలో ఇక డిజిటల్ పాలన..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక పాత తరహా దస్త్రాల పద్ధతికి తెర పడనుంది. ఒక అన్ని విభాగాల్లోనూ ఈ ఫైలింగ్ పద్ధతులను ప్రవేశబెట్టి, ఉద్యోగులకు కూడా డిజిటల్ పని విధానాలపై అవగాహన  కల్పించబోతున్నారు. ఈ ప్రక్రియను మార్చి 2018తో పూర్తి చేసి, ఆ సంవత్సరం ఏప్రిల్ నుండి పాలన పూర్తిగా సాంకేతిక పద్ధతుల ద్వారానే కొనసాగేలా ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న 37 విభాగాల్లోనూ, పరిపాలక వ్యవహారాలు అన్ని కూడా కాగిత దస్త్రాల ద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్ల వాడకం ద్వారా రికార్డులను భద్రపరచడం లాంటి విషయాలు ఇంకా నత్తనడకగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలనలో పారదర్శకతను పెంచేలా ఈ ఫైలింగ్ విధానాన్ని పాటించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం తొలి దశలో ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలను ఎంచుకున్నారు. రెండో దశలో మరో 10 విభాగాలను చేర్చాలని యోచిస్తున్నారు. అలాగే దేవస్థానంలో బ్రాడ్ బ్యాండ్ సేవల వినియోగాన్ని  పెంచాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల దస్త్రాలు పేపర్ ఫార్మాట్‌లో ఉన్నాయి. వాటిని ఈ ఫైలింగ్ చేయించే యోచనలో కూడా ఈవో ఉన్నట్లు తెలుస్తోంది. 

Last Updated : Oct 8, 2017, 04:17 PM IST
తితిదేలో ఇక డిజిటల్ పాలన..!

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక పాత తరహా దస్త్రాల పద్ధతికి తెర పడనుంది. ఒక అన్ని విభాగాల్లోనూ ఈ ఫైలింగ్ పద్ధతులను ప్రవేశబెట్టి, ఉద్యోగులకు కూడా డిజిటల్ పని విధానాలపై అవగాహన  కల్పించబోతున్నారు. ఈ ప్రక్రియను మార్చి 2018తో పూర్తి చేసి, ఆ సంవత్సరం ఏప్రిల్ నుండి పాలన పూర్తిగా సాంకేతిక పద్ధతుల ద్వారానే కొనసాగేలా ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న 37 విభాగాల్లోనూ, పరిపాలక వ్యవహారాలు అన్ని కూడా కాగిత దస్త్రాల ద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్ల వాడకం ద్వారా రికార్డులను భద్రపరచడం లాంటి విషయాలు ఇంకా నత్తనడకగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలనలో పారదర్శకతను పెంచేలా ఈ ఫైలింగ్ విధానాన్ని పాటించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం తొలి దశలో ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలను ఎంచుకున్నారు. రెండో దశలో మరో 10 విభాగాలను చేర్చాలని యోచిస్తున్నారు. అలాగే దేవస్థానంలో బ్రాడ్ బ్యాండ్ సేవల వినియోగాన్ని  పెంచాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల దస్త్రాలు పేపర్ ఫార్మాట్‌లో ఉన్నాయి. వాటిని ఈ ఫైలింగ్ చేయించే యోచనలో కూడా ఈవో ఉన్నట్లు తెలుస్తోంది. 

Trending News