AP Cabinet: ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖారారు.. ఎప్పుడంటే.. ??

ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహుర్తం ఫిక్స్‌ చేసారు సీఎం జగన్‌. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన.. ఈ కార్యక్రమం ఉండనున్నట్టు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 03:44 PM IST
  • ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్
  • మార్చి 27న మంత్రుల రాజీనామా
  • ఏప్రిల్ 2న ఉగాది రోజున కొత్త మంత్రుల ప్రమాణం
AP Cabinet: ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖారారు.. ఎప్పుడంటే.. ??

Date Fixed for AP Cabinet Expansion: ఏపీ కేబినెట్‌ విస్తరణకు సమయం ఆసన్నమైంది. అందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు సీఎం జగన్‌ ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో.. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించాలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు.

ఏపీ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరి పదవి ఊడుతుందో.. ఎవరికి కొత్తగా పదవి దక్కతుందో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. కొద్దిమంది మినహా మిగతా కేబినెట్‌ ను మొత్తం కూడా ప్రక్షాళన చేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ప్రతిపాదికన.. కొత్తవారికి కూడా ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

అయితే మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు కూడా కలిసిరావాలి. లేదంటే అసమ్మతి రాగం పెరిగిపోవడం ఖాయం. అన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ మంత్రిమండలిని విస్తరించాలి. అందుకే సీఎం జగన్‌.. కేబినెట్‌ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. మంత్రిపదవులు రానివారికి పార్టీలో సముచిత స్థానం కల్పించనున్నారు సీఎం జగన్‌. 
ముందుగా చెప్పినట్టుగా అతిత్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉగాది పర్వదినాన.. ఈ కార్యక్రమం ఉండనున్నట్టు సమాచారం. మార్చి 27న ప్రస్తుతం ఉన్న మంత్రులు విస్తరణకు ఆమోదంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు రాజీనామా చేయాలని మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి.

ఉన్నమంత్రులు అందరూ కూడా రాజీనామా చేసినప్పటికీ.. పాతవారిలో కొందరిని తిరిగి తీసుకుంటారు. ఏప్రిల్ 2న ఉగాది కావడంతో ఆ రోజు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించేందుకు ముహుర్తం ఖరారైనట్టు తెలుస్తోంది.ఈ సారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. మరి ఎవరెవరు హిట్‌ కొడుతారో తెలియాలి అంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

Aslo Read: China Corona Cases: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. భయం గుప్పిట్లో చైనా ప్రజలు!

Aslo Read: Modi on Kashmir Files: నిజాలు చూపించారంటూ.. కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ప్రధాని ప్రశంసలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News